పెళ్లి పీటలెక్కబోతున్న సచిన తనయుడు..!

పల్లవి, వెబ్ డెస్క్ : టీమిండియా మాజీ కెప్టెన్ , క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ (25) త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ముంబై కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రవి ఘాయ్ మనమరాలు సానియా ఛందోక్ తో ఇవాళ అతని నిశ్చితార్థం జరిగినట్లు నేషనల్ పేర్కొంది. దీనిపై సచిన్ ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వేడుకకు అతికొద్దిమంది సన్నిహితులు హాజరైనట్లు సమాచారం.
అర్జున్ కు సానియా చందోక్ వీరిద్దరూ చిన్ననాటి ఫ్రెండ్స్. ముంబై బిజినెస్మెన్ రవి ఘాయ్ మనమరాలైనా సానియా ‘లో ప్రొఫైల్’ మెయింటేన్ చేస్తారు. సోషల్ మీడియాతో పాటు బయట కూడా ఎక్కువగా కనిపించరు. ‘మిస్టర్ పాస్’ పేరిట దేశంలోనే తొలి పెట్ స్పాను ముంబైలో నెలకొల్పారు. చిన్నప్పటి నుంచే సచిన్ ఫ్యామిలీతో సానియాకు సాన్నిహిత్యం ఉందట. సారాతో ఆమె కలిసి దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అర్జున్ దేశవాళీ క్రికెట్ లో గోవాకు, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్నారు.