రోహిత్, విరాట్ లేకపోవడం పెద్ద లోటు.!

పల్లవి, వెబ్ డెస్క్ : భారత్ టెస్టు క్రికెట్ కు టీమిండియా మాజీ కెప్టెన్లు, లెజండ్రీ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మూలస్తంభాలని టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చారు.
జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు లేకపోవడం పెద్దలోటు అని వ్యాఖ్యానించారు. అయితే, నా కెరీర్ లో ఇప్పటివరకు వీరిద్దరూ లేకుండా ఏ మ్యాచ్ నేను ఆడలేదు. నేను ఆడిన 50 టెస్టుల్లో ఉంటే విరాట్ కోహ్లీ, లేదా రోహిత్ లేదా ఇద్దరూ ఇలా ఎవరో ఒకరైతే ఉన్నారు.
ఇప్పుడు వీరు లేకుండా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది అని తెలిపారు. ఏదేమైనా వారి నిర్ణయాన్ని మనమంతా గౌరవించాలి. ఇద్దరూ భారత క్రికెట్ కు ఎంతో సేవ చేశారు’ అని కేఎల్ రాహుల్ తెలిపారు.