శుభ్ మన్ గిల్ రికార్డులే రికార్డులు..!

పల్లవి, వెబ్ డెస్క్ : మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన నాలుగోటెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. టీమిండియా బ్యాటర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ శతకాలు సాధించడంతో చివరి వరకు ఆడి ఇంగ్లాండ్ సహానానికి పరీక్ష పెట్టి తమదైన శైలీలో రాణించారు.
అయితే ఈ సిరీస్ లో టీమిండియా ఆటగాడు, కెప్టెన్ అయిన శుభ్ మన గిల్ పలు రికార్డులను తన సొంతం చేస్తున్నారు. ఇంగ్లీష్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో అత్యధిక పరుగులు700లు చేసిన మొట్ట మొదటి ఆసియా ఆటగాడిగా పేరు గాంచాడు. టెస్ట్ జట్టు కెప్టెన్ గా సిరీస్ లోనే రెండు అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ గా 722 పరుగులతో నిలిచారు.
బ్రాడ్ మెన్ 810పరుగులతో మొదటి స్థానంలో ఉన్నారు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఒకే సిరీస్ లో నాలుగు సెంచరీలు చేసిన మూడో కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ నిలిచాడు. బ్రాడ్ మన్ ఇండియాపై 4, సునీల్ గవాస్కర్ వెస్టిండీస్ పై 4 రికార్డును సమం చేశాడు. ఒక టెస్టు సిరీస్ లో ఎక్కువ సెంచరీలు చేసిన నాలుగో ఇండియన్ ఆటగాడిగా (4 సెంచరీలు) , గవాస్కర్ (4), కోహ్లీ (4)తో సమంగా నిలిచాడు.