రిటైర్మెంట్ పై షమీ కీలక వ్యాఖ్యలు..!

పల్లవి, వెబ్ డెస్క్ : టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ రిటైర్మెంట్ పై గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇండియా జట్టుకు చెందిన ఏ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించిన అప్పుడు మహ్మద్ షమీ కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు గుప్పుమంటున్నాయి.
తాజాగా తన రిటైర్మెంట్ పై మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన గురించి విమర్శలు చేసేవాళ్లకు షమీ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ‘ నేను ఎందుకు రిటైర్ అవ్వాలి..?. మీకు ఏమైనా సమస్య ఉంటే చెప్పండి. నా రిటైర్మెంట్ తో ఎవరికి మేలు కలుగుతుంది?. బోర్ కొట్టిన రోజే నేను వెళ్లిపోతా. జాతీయ జట్టుకు తీసుకోకపోతే డొమెస్టిక్ క్రికెట్ ఉంది. ఎక్కడో ఒకచోట నేను క్రికెట్ ఆడుతూనే ఉంటా. నన్ను ఎంపిక చేయనందుకు ఎవర్నీ నిందించను. అవకాశం వచ్చినప్పుడూ సత్తా చాటూతా. అందుకోసమే నేను కష్టపడుతున్నా’ అని మహ్మద్ షమీ స్పష్టం చేశారు.