సిరాజ్ కు షాకిచ్చిన సచిన్

పల్లవి, వెబ్ డెస్క్ : ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో బర్మింగ్హమ్లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా శుభ్ మన్ గిల్ నేతృత్వంలో సూపర్ డూపర్ విజయంతో సిరీస్ ను సమం చేసిన సంగతి తెల్సిందే. అయితే ఆ మ్యాచ్ లో టీమిండియా పేస్ బౌలర్ ఆకాశ్ దీప్ క్రీజులో పాతుకుపోయిన ఇంగ్లీష్ జట్టు బ్యాట్స్ మెన్ అయిన జో రూట్‌ను అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు.
జో రూట్‌ను పెవిలియన్ కు పంపిన పేస్ బౌలర్ ఆకాశ్ సంధించిన ఆ బంతినే టీమిండియా లెజండ్రీ మాజీ ఆటగాడు, భారతరత్న, మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ బాల్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపిక చేశాడు. ‘నా దృష్టిలో జో రూట్‌ను బౌల్డ్ చేసిన ఆకాశ్ దీప్ బంతి అద్భుతం. అతడి వికెట్ తీయడం మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఆకాశ్ విసిరిన బంతిని కాస్త ఆలస్యంగా ఆడాడు రూట్. భీకర ఫామ్‌తో పాటు టన్నుల కొద్దీ పరుగులు బాదిన రూట్‌ను ఔట్ చేయడం ద్వారా భారత జట్టు విజయావకాశాలు పెరిగాయి. అందుకే.. ఆ బంతిని బాల్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంచుకున్నా’ అని సచిన్ ఎక్స్ లో వివరించాడు.దీంతో అండరన్స్ – టెండూల్కర్ ట్రోఫీలో నిప్పులు చెరిగిన మహ్మద్ సిరాజ్ మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ షాకిచ్చాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.