రోహిత్ శర్మ రికార్డు..!

పల్లవి, వెబ్ డెస్క్ : ఇటీవల టెస్ట్ క్రికెట్ , టీ20 లకు గుడ్ బై చెప్పిన టీమిండియా వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్, సీనియర్ స్టార్ ఆటగాడు, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ..ఐసీసీ వన్డే ర్యాంకింగ్ జాబితాలో తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు. నిన్న బుధవారం ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్ జాబితాలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (756) ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని రెండో ర్యాంక్ లో నిలిచాడు.
ప్రస్తుతం వన్డే క్రికెట్ కెరీర్ పై అనుమానాలు రేకెత్తిస్తోన్న తరుణంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ర్యాంకును మెరుగుపరుచుకుని రెండో స్థానంలో ఉండటంతో అతనికి తనపై నమ్మకాన్ని నిలబెట్టేలా ఉంటదని క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు, ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ తర్వాత క్రికెట్ కు దూరంగా టీమిండియా కెప్టెన్ ఉన్న రోహిత్.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు అప్పుడే తన ప్రాక్టీస్ ను షురూ చేశాడు.
2019 వరల్డ్ కప్ టైమ్ లో సైతం రోహిత్ శర్మ కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్ పాయింట్లు (882) సాధించాడు. చివరిసారి చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. మరోవైపు టీమిండియా టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ (784) టాప్ ర్యాంక్ లో ఉన్నాడు. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి (736) నాలుగో ర్యాంక్ లో ఎలాంటి మార్పు లేదు.టీమిండియా తరపున యంగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ (704), కేఎల్ రాహుల్ (638) వరసగా 8, 15వ ర్యాంక్ ఉన్నారు.