చరిత్రలో ఒకే ఒక్కడు ఎంఎస్ ధోనీ..!
పల్లవి, వెబ్ డెస్క్ : టీమిండియా మాజీ లెజండ్రీ ఆటగాడు.. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. నిన్న బుధవారం కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై విజయం సాధించింది.
కేకేఆర్ పై గెలుపును సాధించినా కానీ చెన్నై పాయింట్ల పట్టికలో చెన్నై చివరి స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో ధోనీ పదిహేడు పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఈ క్రమంలో ఆయన అరుదైన మైలురాళ్లను చేరుకున్నారు.
ఐపీఎల్ చరిత్రలో వంద మ్యాచ్ ల్లో నాటౌట్ గా నిలిచిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించారు. అంతే కాకుండా అత్యధికంగా రెండోందల డిస్మసల్స్ లో పాలుపంచుకున్న కీపర్ గా కూడా ధోనీ నిలిచారు.



