డేటింగ్ రూమర్లకు “దాంతో” చెక్ పెట్టిన సిరాజ్..!

పల్లవి, వెబ్ డెస్క్ : ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన అండర్శన్ – టెండూల్కర్ టెస్టు సిరీస్ లో అద్భుత ప్రదర్శనతో టీమిండియా జట్టుకు ఘనవిజయాలను అందించిన హైదరాబాద్ స్పీడ్ గన్ , తెలంగాణ ఆటగాడు మహ్మద్ సిరాజ్. మహ్మద్ సిరాజ్ ప్రముఖ సింగర్ ఆశా భోస్లే మనవరాలు అయిన జనాయ్ భోస్లే తో గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నాడని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అంతేకాదు వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని కూడా ఇటు సోషక్ మీడియాలో అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రత్యేక కథనాలు సైతం వెలువడ్డాయి.
తాజాగా వీరిద్దరిపై వస్తున్న రూమర్లకు రాఖీ పండుగ సందర్భంగా చెక్ పడింది. జనాయ్ భోస్లే టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కు రాఖీ కట్టి ఆశీర్వాదించిన వీడియోను సిరాజ్ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేశారు. రాఖీ పండుగ సందర్భంగా వీరిద్దరూ కల్సి చేసుకున్న రాఖీ వేడుకల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జనాయ్ సిరాజ్ కు రాఖీ కట్టడంతో వీరిద్ధరి మధ్య ఉన్నది కేవలం అన్నాచెల్లెలి అనుబంధం మాత్రమే. సోషల్ మీడియా, మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వీరిద్దరూ స్పష్టం చేసినట్లు అయింది. సిరాజ్ పోస్టు చేసిన వీడియోకు నెటిజన్ల నుంచి పాజిటీవ్ కామెంట్ల వర్షం కురుస్తుంది. ఇకనైనా వీరిద్దరిపై రూమర్ల వార్తలను ఆపేయాలని, సెలబ్రేటీల గురించి ఇలాంటి పుకార్లు , అసత్య ప్రచారం చేయోద్దని కామెంట్లు చేస్తున్నారు. సిరాజ్ పోస్టు చేసిన ఈవీడియోకు టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ సైతం లవ్ ఎమోజీతో స్పందించి శుభాకాంక్షలు తెలియజేశాడు.