ఆసియా కప్ కు బుమ్రా దూరం..?

పల్లవి, వెబ్ డెస్క్ : ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ కు వర్క్ లోడ్ కారణంగా టీమిండియా ఫాస్ట్ సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా ఆయనకు తరచూ బీసీసీఐ విశ్రాంతి ఇస్తోంది.
ఈ క్రమంలో తాజాగా ఆసియా కప్ 2025కు టీన్ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నట్లు తెలుస్తోంది.వర్క్ లోడ్ కారణంగా ఆయన ఆడే అవకాశాలు తక్కువేనని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. అక్టోబర్ నెలలో వెస్టీండిస్ జట్టుతో జరగనున్న టెస్టు సిరీస్ కు మాత్రమే బుమ్రా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపాయి. కాగా ఆసియా కప్ సెప్టెంబర్ 9న ప్రారంభమై 28న ముగుస్తుంది.