కోహ్లీ, రోహిత్ ల పై గంగూలీ కీలక వ్యాఖ్యలు..!

పల్లవి, వెబ్ డెస్క్ : టీ20ల నుంచి రిటైరైన స్టార్ క్రికెటర్లు వన్డేలోనైనా కొనసాగుతారా లేదా అన్న చర్చ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ , బీసీసీఐ మాజీ అధ్యక్షులు సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. దాదా మాట్లాడూతూ ” భారత్ క్రికెట్ ఎవరికోసం ఆగదు. గవాస్కర్ తర్వాత సచిన్ వచ్చారు.
ద్రవిడ్ , సెహ్వాగ్ , లక్ష్మణ్ వెళ్లాక కోహ్లీ ఎమర్జ్ అయ్యారు. ఇప్పుడు జైస్వాల్, పంత్, గిల్ నిలబడ్డారు. డొమెస్టిక్ క్రికెట్, ఐపీఎల్ రూపంలో ఇండియా క్రికెట్ కు పటిష్ట వ్యవస్థ ఉందని” కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గంగూలీ మాట్లాడుతూ ” బాగా ఆడేవారినే కొనసాగించాలి. కోహ్లీ, రోహిత్ ఫామ్ లో ఉంటే కంటిన్యూ చేయాలి. వన్డేల్లో వారిద్దరి రికార్డు అద్భుతం . వైట్ బాల్ క్రికెట్ లోనూ వారికి తిరుగులేదు. బీసీసీఐ మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తోందో తెలియదు కదా అని వ్యాఖ్యానించారు.