సురేష్ రైనాకు ఈడీ నోటీసులు…!

పల్లవి, వెబ్ డెస్క్ : టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకు ఈడీ సమన్లు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో భాగంగా రేపు గురువారం విచారణకు హాజరు కావాలని కోరింది.
ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యలయంలో రైనాను విచారించనున్నారు. ఓ బెట్టింగ్ యాప్కు సురేశ్ రైనా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పలువురు బాలీవుడ్ నటులు, సెలబ్రిటీలను ఈడీ విచారిస్తోంది