ఫిడే మహిళల చెస్ వరల్డ్ విన్నర్ గా దివ్య దేశ్ముఖ్

నాగపూర్ కు చెందిన దివ్య దేశ్ ముఖ్ ఈరోజు సోమవారం జరిగిన ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో కోనేరు హంపి పై గెలుపొంది ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ విజేతఫా నిలిచింది. తాజాగా దివ్య దేశ్ ముఖ్ సాధించిన ఈ విజయంతో పంతొమ్మిదేండ్ల దివ్య దేశ్ ముఖ్ ఎనబై ఎనిమిదో గ్రాండ్ మాస్టర్ గా అవతరించింది.
కోనేరు హంపి , దివ్య దేశ్ ముఖ్ ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తొలి ర్యాపిడ్ ట్రై బ్రేకర్ డ్రాగా ముగిసింది. అయితే ఆ తర్వాత రెండో గేమ్ లో మొత్తం డెబ్బై ఐదో ఎత్తుల్లో కోనేరు హంపిపై దివ్య గెలుపొందింది.
దీంతో 2025 ఫిడే మహిళల ప్రపంచ కప్ మహిళల ఫైనల్స్ కు చేరిన మొట్ట మొదటి క్రీడాకారిణిగా దివ్య నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో దివ్యకు 1.5 పాయింట్లు లభించాయి. కోనేరు హంపికి 0.5 పాయింట్లు లభించాయి. అయితే ఆదివారం జరిగిన మ్యాచ్ లో దివ్యకు హంపి గట్టి పోటీనిచ్చింది. దీంతో ఫలితం ట్రై బ్రేకర్ కు చేరింది.