రిటైర్మెంట్ పై ధోనీ కీలక వ్యాఖ్యలు..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఐపీఎల్ సీజన్ ఎప్పుడు మొదలైన కానీ ఈ సీజన్ అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్, లెజండ్రీ మాజీ ఆటగాడు మహేందర్ సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు గుప్పుమంటాయి.
తాజాగా ఈ సీజన్ లో కూడా అవే వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై ఎంఎస్ ధోనీ స్పందిస్తూ ” రిటైర్మెంట్ విషయంలో నాకు కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకు ఇంకా నాలుగు నుండి ఐదు నెలల సమయం ఉంది.
రాబోయే రోజుల్లో దీని గురించి నిర్ణయం తీసుకుంటాను. ప్రదర్శనను బట్టి ఆటగాడు రిటైర్ అవ్వాలంటే ప్రతి ప్లేయర్ ఇరవై రెండేండ్లకే రిటైరవ్వాలి. వచ్చే సీజన్ కు తిరిగి వస్తాను అని చెప్పలేను.. అలాగని రాలేనని చెప్పలేను. తీరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని” వ్యాఖ్యానించారు.



