కోహ్లీ, రోహిత్ లకు బీసీసీఐ బిగ్ షాక్..!

పల్లవి, వెబ్ డెస్క్ : టీమిండియా జట్టు మాజీ సారథులు, లెజండ్రీ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. రెండేండ్ల తర్వాత అంటే 2027లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ ప్లాన్ నుంచి రోహిత్, కోహ్లీ లను తప్పించనున్నట్లు క్రీడా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ వీరిద్దరూ వరల్డ్ కప్ లో ఆడాలనుకుంటే విజయ్ హజారే ట్రోఫీలో పాల్గోనాలనే నియమ నిబంధనలను బీసీసీఐ విధించనున్నట్లు క్రీడా వర్గాల్లో గుసగుసలు. అయితే వీరిద్దరి స్థానంలో కుర్రాళ్లను ప్రోత్సహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు మీడియాతో అన్నట్లు టాక్. చూడాలి మరి ఇటీవల టెస్ట్, టీ20 లకు గుడ్ బై చెప్పిన రోహిత్, కోహ్లీ ప్రస్తుతం కేవలం వన్డే క్రికెట్ లోనే కొనసాగుతున్నారు.