వరల్డ్ టాప్ లీడర్ గా మోదీ
పల్లవి, వెబ్ డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రపంచలోనే మోస్ట్ బీలీవర్ లీడర్ గా ఘనతను సాధించాడు. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ గ్లోబల్ లీడర్ సర్వేలో మరోసారి ప్రధాని మోదీ తన ఆధిక్యాన్ని నిలుపుకున్నారు. ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో మోదీకి అత్యధిక శాతం మంది ఓట్లు వేసి తమ మద్ధతును తెలిపారు. ఈ ఏడాది జూలై నాలుగు నుంచి పదో తారీఖుల మధ్య నిర్వహించిన గ్లోబల్ లీడర్ సర్వేలో అప్రూవల్ రేటింగ్స్ ఏకంగా 75 శాతానికి చేరాయి.
ఈ సర్వేలో ప్రధాని నెం.1గా నిలవడంపై బీజేపీ సీనియర్ నేత అమిత్ మాల్వీయ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజల గౌరవాభిమానాలు చూరగొన్న నేతగా ప్రధాని నిలిచారని ఆయన అన్నారు. అత్యధిక అనుకూల రేటింగ్స్ కలిగిన నేతగా ఉన్నారంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. బలమైన నాయకత్వం, ప్రపంచవ్యాప్తంగా గౌరవాభిమానాలు పొందే నేత సారథ్యంలో భారత్ భద్రంగా ఉందని ఆయన కామెంట్ చేశారు.
ఇక తాజా సర్వేలో ప్రధాని తర్వాతి స్థానంలో దక్షిణ కొరియా నేత లీ జే మ్యూంగ్ ఉన్నారు. 59 శాతం అప్రూవల్ రేటింగ్స్‌తో రెండో స్థానంలో నిలిచారు. ఆ తరువాతి స్థానాల్లో అర్జెంటీనా నేత జేవియర్ మైలీ (57 శాతం), కెనడా అధినేత మార్క్ కార్నీ (56 శాతం) ఉన్నారు. ఇక ఈ జాబితాలో 44 శాతం అప్రూవల్ రేటింగ్స్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎనిమిదో స్థానంలో నిలవడం విశేషం.



