ఎవరూ… ఈ సదానందం మాస్టర్ …!
పల్లవి, వెబ్ డెస్క్ : ఈరోజు సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నలుగురు సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేశారు. రాజ్యసభ సభ్యులుగా హై ప్రొఫైల్ క్రిమినల్ కేసులు వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ దియోరావ్ నికమ్, కేరళకు చెందిన విద్యావేత్త, సోషల్ వర్కర్ సి. సదానందన్ మాస్టర్, మాజీ విదేశాంగ సెక్రటరీ హర్షవర్ధన్ శ్రింగ్లా, చరిత్రకారిణి మీనాక్షి జైన్ ను నామినేట్ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది.
రాజ్యసభకు నామినేట్ అయిన విద్యావేత్త, సోషల్ వర్కర్ సి. సదానందన్ మాస్టర్ గురించి ప్రస్తుతం చర్చ నడుస్తోంది. సదానందణ్ మాస్టర్ కేరళలోని కన్నూర్ లో జన్మించారు. స్వతహాగా కరుడుగట్టిన కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టిన ఆయన ఆ విధానాలతో విభేదించి ఆర్ఎస్ఎస్ లో చేరారు.
ఇది తట్టుకోలేని కమ్యూనిస్టులు 1994లో ఆయనపై దాడిచేసి ఏకంగా ఆ మాస్టర్ వి 2 కాళ్లు నరికేశారు. ప్రాణాలతో బయటపడి కృత్రిమ కాళ్లపై నడుస్తూ టీచర్ , సమాజసేవకుడిగా మంచిపేరు తెచ్చుకున్నారు. 2016, 2021 లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కూత్తుపరంబలో బీజేపీ తరఫున పోటీచేసి ఓడారు. ఆయన కోసం అప్పట్లో ఏకంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ కూడా స్వయంగా ఎన్నికల ప్రచారం చేశారు.



