భారత్ పై అణుబాంబు దాడి చేస్తాము.!
పల్లవి, వెబ్ డెస్క్ : కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ కు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలకు ఏమి తోచని స్థితిలో పాక్ ఉంది. ఈ నేపథ్యంలో భారత్ ను రెచ్చ గొట్టేలా రష్యాలో ఉంటున్న పాక్ అంబాసిడర్ మహ్మద్ ఖలీద్ జమాలీ భారత్ పై అణు బాంబులతో దాడి చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు..
భారత్ కొన్ని చోట్ల దాడులు చేస్తుందనే సమాచారం తమకు ఉందని జమాలీ ఆరోపించారు.. భారత్ దాడి చేస్తే పూర్తిస్థాయిలో దాడికి దిగుతామంటూ ఈసందర్భంగా వార్నింగ్ ఇచ్చారు..



