సోనియా గాంధీకి తీవ్ర అస్వస్థత.!

పల్లవి, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కమిటీ చైర్ పర్శన్, సీనియర్ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
దీంతో ఆమెను సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించినట్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రిన్సిపల్ మీడియా అడ్వైజర్ నరేష్ చౌహాన్ ధృవీకరించారు.
ప్రస్తుతం ఆమెకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
డెబ్బై ఎనిమిదేండ్ల సోనియా గాంధీ చివరగా దివంగత మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ అరవై ఒకటి వర్థంతి వేడుకల సందర్భంగా కనిపించారు.