ఆధార్ కార్డుపై సంచలన తీర్పు…!

పల్లవి, వెబ్ డెస్క్ : ఆధార్ కార్డు, పాన్, ఓటర్ కార్డుల గురించి మహారాష్ట్రలోని బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అందులో భాగంగా ఆధార్, పాన్ , ఓటర్ కార్డులను పౌరసత్వంగా గుర్తించలేమని హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అయితే, కొన్ని సేవలను పొందేందుకు మాత్రమే ఈ కార్డులు ఉపయోగపడతాయి.
వాటీకోసమే వీటిని గుర్తింపు కార్దులుగా గుర్తించాలని , దేశ పౌరసత్వానికి ఇవి ఖచ్చితమైన రుజువు కాదు అని హైకోర్టు స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ దేశం నుంచి అక్రమంగా వచ్చిన బాబు అబ్దుల్ రౌఫ్ సర్దార్ అనే వ్యక్తి తాను భారతీయుడినని ఆధార్, పాన్ , ఓటర్ కార్డులున్నాయని , వాటిగా రుజువుగా చూపించారు. వీటిని పరిశీలించిన హైకోర్టు అవి ఆధారాలు కావని అతడ్కి బెయిల్ నిరాకరించింది.