ప్రధాని మోదీ యువతకు పిలుపు..!

పల్లవి, వెబ్ డెస్క్ : దేశంలోని యువత స్వదేశీ వస్తువులనే కొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ ” ఒక్క విదేశీ వస్తువును కూడా ఇంటికి తీసుకురాకూడదని యువత నిర్ణయించుకోవాలి. స్వదేశీ వస్తువులే విక్రయిస్తామని వ్యాపారులు తమ దేశ వ్హక్తిని చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీ ఇంకా మాట్లాడుతూ ” మేము స్వదేశీ వస్తువులే విక్రయిస్తాం అని దుకాణాల బయట బోర్డులు పెట్టాలి. మేక్ ఇన్ ఇండియా , ఆత్మ నిర్భర్ భారత్ మన బలం . స్వదేశీ ఉద్యమం మన భవిష్యత్తుకు భరోసానిస్తుంది” అని ఆయన అన్నారు.మహిళా సాధికారత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని మోదీ నొక్కిచెప్పారు. కొత్తగా నిర్మిస్తున్న ఈ హాస్టల్లో 3,000 మంది బాలికలకు వసతి కల్పించనున్నామని, ఇది వారిని ఆత్మవిశ్వాసంతో ఎదిగేలా చేస్తుందని తెలిపారు.
వడోదర, సూరత్, రాజ్కోట్, మెహసానా వంటి నగరాల్లోనూ ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు బాలికా విద్య కోసం ప్రారంభించిన ‘కన్యా శిక్షా రథ యాత్ర’ వంటి కార్యక్రమాలు ఇప్పుడు ‘బేటీ బచావో, బేటీ పఢావో’ రూపంలో దేశవ్యాప్త ఉద్యమంగా మారాయని గుర్తుచేశారు.గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు ‘లఖ్పతి దీదీలు’, ‘డ్రోన్ దీదీ’, ‘బ్యాంక్ సఖి’ వంటి పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని మోదీ తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం ద్వారా నైపుణ్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా భారత నైపుణ్య మానవ వనరులకు డిమాండ్ పెరుగుతోందని ప్రధాని అన్నారు