పహాల్ గామ్ ఉగ్రదాడి సూత్రదారి ఇతడే..!

కశ్మీర్ పహాల్ గామ్ ఉగ్రదాడిలో దాదాపు ఇరవై ఆరు మంది మృత్యువాత పడగా.. కొంతమంది గాయాలుపాలయ్యారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అందులో భాగంగా పాకిస్థాన్ దేశాన్ని అష్టదిగ్భందనం చేసింది.
పలు కఠిన చర్యలను సైతం తీసుకుంది. ఈ క్రమంలో పహల్ గామ్ ఉగ్రదాడి సూత్రదారిగా ఫరూఖ్ అహ్మాద్ అనే లష్కరే తోయిబా కమాండర్ గా ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
పాక్ అక్రమిత కశ్మీర్ లో తలదాచుకుంటూ పలు యాప్ ల ద్వారా కశ్మీర్ అంతటా నెట్ వర్కును నడిపిస్తున్నట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. అయితే గత రెండేండ్లల్లో జరిగిన చాలా సంఘటనల్లో ఇతడి పాత్ర ఉందని పేర్కొన్నాయి.