ఆపరేషన్ సింధూర్ దాడిలో ఉగ్ర కీలక నేతలు మృతి..!
పల్లవి, వెబ్ డెస్క్ : పహల్గాం లో పర్యాటకులపై ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ లో తొమ్మిది ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ భద్రతా బలగాలు సంయుక్తంగా దాడి చేసింది. ఈ దాడిలో తొంబై నుండి వందకు పైగా ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.
ఈ దాడిలో ఉగ్రవాదులకు కీలకమైన నేతలు హతమైనట్లు భద్రతా బలగాలు తెలిపాయి.ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా మురిడ్కేలోని మర్కజ్ తయ్యబాపై జరిగిన మెరుపు దాడిలో లష్కరే తోయిబా నేత హఫీజ్ అబ్దుల్ మాలిక్ , మరో ఉగ్ర నేత ముదాసిర్ మృతి చెందినట్లు సమాచారం.



