pallavinews
Pallavi E-Paper E-PAPER
  • Home Icon
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
pallavi news search-icon
  • pallavi news facebook-icon
  • pallavi news Twitter-icon
  • pallavi news whatsapp-icon
  • pallavi news instagram-icon
  • pallavi news youtube-icon
pallavi news trending-icon

Trending

  • బిగ్ బాస్ 8 తెలుగు
  • హైడ్రా
  • సీఎం రేవంత్ రెడ్డి
  • Home »
  • National »
  • Non Veg Ban In Bhavnagar In Gujarat

మాంసం ప్రియులకు షాక్.. ఇక నుంచి అమ్మాకాలు చట్టవిరుద్ధం

మాంసం ప్రియులకు షాక్.. ఇక నుంచి అమ్మాకాలు చట్టవిరుద్ధం
  • Edited By: Pallavi,
  • Published on July 13, 2024 / 05:44 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

గతంలో నాన్ వెజ్ తినాలంటే.. ఎవరైన చుట్టాలు ఇంటికైన రావాలి..లేదంటే ఏదైన ఫెస్టివల్ అయిన అయ్యుండాలి.. అప్పుడే ఇంట్లో నాన్ వెజ్ వండుతారు. కానీ.. కాలం మారింది. అప్పుడు.. ఇప్పుడు అనే తేడా ఏం లేదు.. తినాలనిప్తే చాలు.. వెంటనే దొరుకుతుంది. ఆన్ లైన్ లో ఆర్డర్ ఇస్తే.. వెంటనే డెలివరి బాయ్ ఇంటిముందు వాలిపోతాడు. ఇక, మనదేశంలో మాంసం ప్రియులే ఎక్కువ.

మాంసం ముక్క లేనిదే ఏ కార్యం జరగదు. ఆలాంటిది.. మాంసాహారాన్ని నిషేదిస్తే తట్టుకోలగలుగుతారా?. అయితే.. ఈ వార్తా మాంసాహార ప్రియులకు పెద్ద షాకే. ఎందుకంటే.. మాంసం అమ్మాకలను నిషేధించారు. మాంసం అమ్మకం, వినియోగం చట్టవిరుద్ధమని..అతిక్రమిస్తే శిక్షలు తప్పవని స్థానిక అధికారులు నిబంధనలు తీసుకొచ్చారు.

అయితే.. ఇది దేశమంతట కాదు.. గుజరాత్​రాష్ట్రంలోని భావ్‌నగర్(డి)లోని జైనుల ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన పాలిటనా సిటీలో మాంసం అమ్మకాలు చట్టవిరుద్ధం చేశారు అధికారులు. దీంతో ప్రపంచంలోనే మాంసం అమ్మకాలు చట్టవిరుద్ధం చేసిన మొదటి నగరంగా పాలిటనా నిలిచింది.

నగరంలో దాదాపు 250 మాంసం దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు 200 మంది జైన సన్యాసులు నిరసనలకు దిగారు. మాంసాహారం.. మనుషుల సున్నితత్వాన్ని దెబ్బతీస్తుందని.. ప్రజలను, ముఖ్యంగా పిల్లలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని వాదించారు. ఈ క్రమంలో స్థానిక అధికారులు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.

మాంసం కోసం జీవాలను చంపడం, అమ్మడం, రవాణా చేయడం చట్ట విరుద్ధమని నిబంధనలు తీసుకొచ్చారు. నిబంధనలు ఉల్లంఘించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మాంసాహారం తయారీ, ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో వడోదర, జునాగఢ్, అహ్మదాబాద్‌లోనూ ఈ నిబంధనలను అమలు చేయనున్నారు. కాగా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

pallavi news whatsappPallavi News వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Tag

  • Bhavnagar City
  • Gujarat.
  • Non Veg
  • Non Veg ban
  • Pallavi news

Related News

  • రేపే మిత్ర మండలి’ మూవీ విడుదల

  • బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ

  • అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

  • మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

  • సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ

  • ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్

Latest
  • నవంబర్ 14న “సీమంతం” విడుదల

  • రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ

  • మత్తెక్కిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్

  • ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు

  • అందరూ మెచ్చే చిత్రం ‘బ్యూటీ’

  • అభిమానుల కోసమే అది – పవన్ కళ్యాణ్

  • స్మృతి మంధాన రికార్డుల మోత

  • ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణకు అగ్రస్థానం – మంత్రి తుమ్మల

  • ఉపఎన్నికలపై పీసీసీ చీఫ్ మహేశ్ సంచలన వ్యాఖ్యలు

  • స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్ డేట్

Pallavi News
Address:
100 feet road, Kavuri Hills Phace- 3, Sriramana colony, Madhapur, Hyderabad, Telengna- 500081
epaper@pallavimedia.com.
www.pallavinews.com
Ph: 63013 12393
  • Telangana
  • Andhra Pradesh
  • Hyderabad
  • International
  • Life style
  • Sports
  • Crime
  • Photo gallery
  • Education
About Us Contact Us Privacy Policy