ఎర్రకోట వేదికగా పాక్ కు మోదీ హెచ్చరిక..!

పల్లవి, వెబ్ డెస్క్ : 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఎర్రకోటలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ” స్వాతంత్య్ర దినోత్సవం 140కోట్ల మంది సంకల్ప పండుగ అని, స్వాతంత్య్ర పోరాటంలో కోట్లాది మంది త్యాగాలతో స్వాతంత్య్రం సాధించుకున్నామని ” అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇవాళ సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయం. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగిరే సమయం. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు. దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం.రాజ్యాంగం మనకు అనునిత్యం మార్గదర్శనం చేస్తోంది అని అన్నారు.
రాజ్యాంగ నిర్మాతల సేవలను నిత్యం గుర్తుచేసుకుంటున్నాం. రాజ్యాంగం కోసం బలిదానం చేసిన తొలివ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ. శ్యామప్రసాద్ ముఖర్జీ త్యాగం మరువలేనిది. ఆపరేషన్ సిందూర్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లకు సెల్యూట్. మన వీర జవాన్లు శత్రువును ఊహించని రీతిలో దెబ్బకొట్టారు. పహల్గామ్లో ఉగ్రవాదులు మతం అడిగి మరీ చంపారు. భార్య, కన్నబిడ్డల కళ్లెదుటే దారుణంగా కాల్చి చంపారు’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.