ఉగ్రవాదులకు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్…!
Modi's strong warning to terrorists
పహల్ గామ్ లో దాడులకు పాల్పడి ఇరవై మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఉగ్రవాదులకు ప్రధాన మంత్రి నరేందర్ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీహార్ రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ మాట్లాడుతూ ” ఈ దాడి పర్యాటకుల పై జరిగిన దాడి కాదు.
యావత్ అఖండ భారతవానిపై జరిగిన దాడి. ఈ దాడితో భారతదేశమంతా దుఖం లో ఉంది. ఉగ్రవాదులను ఎక్కడ ఉన్న వదిలిపెట్టము. వాళ్లను మట్టిలో కలిపే సమయం ఆసన్నమైంది. ఈ దారుణదాడిలో కొంతమంది భర్తలను కోల్పోయారు.
మరికొంత మంది భార్యలను కోల్పోయారు. బీహార్ నేలపై నుండి ప్రపంచానికి చెబుతున్నాను. ఉగ్రవాదులను ఎవర్ని వదిలిపెట్టము. అందర్ని పట్టుకోని మట్టిలో కలిపేస్తాము అని అన్నారు.



