ట్రంప్ కు మోదీ కౌంటర్

పల్లవి, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై గత కొద్దిరోజులుగా తన అక్కసును వెళ్లగక్కుతున్న సంగతి తెలిసిందే. అమెరికా నుంచి డెయిరీ ప్రొడక్ట్స్ దిగుమతికి భారత్ నో చెప్పడమే ఇందుకు కారణం అని సమాచారం. పాల ఉత్పత్తుల్లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. ఎనిమిది కోట్ల మంది రైతులు మన దేశంలో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.
ఒకవేళ అమెరికా ప్రొడక్ట్స్ వస్తే ప్రతి ఏటా సుమారు రూ.1.03లక్షల కోట్ల దేశీయ ఆదాయం కోల్పోతామని భారత్ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత్ నో చెప్పడంతో యాబై శాతం సుంకాలను అమెరికా అధ్యక్షులు ట్రంప్ విధించారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ‘ ఇండియాలో అమెరికా అగ్రీ , డెయిరీ ప్రొడక్ట్స్ ను విక్రయించేమ్దుకు అనుమతి ఇవ్వాలని అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ కోరారు. నేను దానికి అంగీకరించలేదు.
భారత్ తొలి ప్రాధాన్యం రైతులకే. అన్నదాతలు, మత్స్యకారులు, పశుపోషకుల విషయంలో మేం రాజీపడం . దీనికి నేను వ్యక్తిగతంగా మూల్యం చెల్లించాల్సి రావోచ్చు. అందుకు నేను సిద్ధమే తప్పా ఎవరికి తలవంచను. దేశ ప్రజల జీవితాలను ఫణంగా పెట్టలేను’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.