భారత్ సంచలన నిర్ణయం..!
పాక్ భారత్ సరిహద్దు ప్రాంతమైన జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ మరోసారి భారీ పేలుళ్లతో మారుమ్రోగింది. శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో ఈరోజు శనివారం ఉదయం పదకొండు గంటల నలబై ఐదు నిమిషాలకు భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి..
దీంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పేలుళ్ల తీవ్రతకు సమీప ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తక్షణమే స్పందించిన భద్రతా బలగాలు పలు ప్రాంతాల్లో సైరన్లు మోగించి అక్కడి ప్రజలను అప్రమత్తం చేశాయి అని ఆర్మీ అధికారులు తెలిపారు.
అంతేకాకుండా స్థానికంగా ఉండే బహిరంగ ప్రదేశాలు, బాల్కనీలలో ఉండకుండా ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని ఆర్మీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.



