పాక్ కు భారత్ మరోషాక్..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఆపరేషన్ సింధూర్ తో పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడమే కాకుండా వందకు పైగా ఉగ్రవాదులతో పాటు కీలక నేతలను మట్టుపెట్టింది ఇండియన్ ఆర్మీ.. కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే ఈ టాస్క్ ను పూర్తి చేసి యావత్ ప్రపంచమంతా ప్రశంసలు కురిపించేలా మెరుపు దాడులు చేసింది.
తాజాగా పాకిస్థాన్ కు భారత్ మరో షాకిచ్చింది. ఈ రోజు గురువారం ఉదయం పాకిస్థాన్ పై ఇండియా మరోసారి విరుచుకుపడింది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై అటాక్ చేసింది. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్న పాకిస్థాన్ కు సరైన సమాధానమిచ్చేందుకు ఈ ఆపరేషన్ నిర్వహించింది.
ఈ క్రమంలో లాహోర్ లోని గగనతల రక్షణ వ్యవస్థలు భారీగా ధ్వంసమైనట్లు సమాచారం. హెచ్ క్యూ-9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలని చైనా నుంచి పాక్ కొనుగోలు చేసింది. వీటిని ఇండియా విజయవంతంగా ధ్వసం చేసినట్లు తెలుస్తోంది.



