పాక్ కు భారత్ మరో దెబ్బ..!

పల్లవి, వెబ్ డెస్క్ : కశ్మీర్ లోని పహల్గాం లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్థాన్ పై నీటి యుద్ధం చేస్తోన్న సంగతి మనకు తెల్సిందే. ఇందులో భాగంగా జమ్ము కశ్మీర్ లోని చీనాబ్ నది పై ఉన్న బాగ్లిహార్, ఇన్ సలాల్ డ్యాంల గేట్లను ఇరవై నాలుగు గంటల పాటు మూసి వేసింది.
తాజాగా ఆ గేట్లను భారత్ తెరిచింది. దీంతో పాకిస్థాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పీఓకే , పంజాబ్ ప్రావిన్స్ లోని సియాల్ కోట్, తదితర పట్టణాలకు వరద హెచ్చరికలు జారీ చేసింది. చీనాబ్ నదీ ప్రవాహం ఉద్ధృతమవుతుందని పాకిస్థాన్ తమ ప్రజలకు వార్నింగ్ ఇచ్చింది.