రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక..!

పల్లవి, వెబ్ డెస్క్ : ఇండియాలో రోజూవారీ కార్యక్రమాలైన, పండగలైనా, పబ్బాలైనా మధ్యతరగతి, సామాన్యులు ఉపయోగించే ప్రయాణ సాధనం రైలు. రోజులో ఎక్కువమంది రైళ్లలోనే జర్నీ చేస్తారు. అయితే వీరికో ముఖ్య గమనిక.. అందులో భాగంగా రైళ్లలో జర్నీ చేసేవాళ్లు తమతో పాటు తీసుకెళ్లే లగేజ్ పై రైల్వే శాఖ అంక్షలు విధించింది. అందులో లగేజీకి సంబంధించిన నియమాలు కూడా ఉన్నాయని చాలా మందికి కూడా తెలియదు. అయితే, ట్రైన్‌లో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చు? పరిమితి మంచి లగేజీ తీసుకెళ్తే ఏం జరుగుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చు?
ప్రతి ప్రయాణికుడు టికెట్ తీసుకున్న తరహా (క్లాస్)ను బట్టి నిర్ణీత బరువులోపల లగేజీ తీసుకెళ్లవచ్చు.
ఉదాహరణకు:
స్లీపర్ క్లాస్‌కి: సుమారు 40 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లవచ్చు
ఏసీ కోచ్‌లకు: 50-70 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు
సాధారణ క్లాస్‌కి: 35 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు
మీరు ఈ పరిమితిని మించిన బరువు తీసుకెళ్తే అదనపు ఛార్జీలు కట్టాల్సి వస్తుంది అని రైల్వే నియమాలు చెబుతున్నాయి..