రైల్వే ప్రయాణికులకు శుభవార్త

పల్లవి, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం మధ్య నడిచే శబరి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్తను తెలిపింది.
అందులో భాగంగా సికింద్రాబాద్ – తిరువనంతపురం మధ్య నడిచే శబరి ఎక్స్ ప్రెస్ ను శబరి సూపర్ ఫాస్ట్ గా మారుస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
రైల్వే శాఖ తీసుకున్న తాజా నిర్ణయంతో శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఇకపై ప్రతిరోజూ మ.2.35 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలు దేరుతుంది. తర్వాతి రోజూ సాయంత్రం 6.20కు తిరువనంతపురం చేరనుంది. అలాగే అక్కడ ఉ.6.45కు బయల్దేరి తర్వాతి రోజు ఉ.11 గంటలకే సికింద్రాబాద్ రానుంది.