జమ్ముకశ్మీర్ లో ఎన్నికలు జరపాలి: ఏఐసీసీ చీఫ్ ఖర్గే
సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం జమ్ముకశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘ఆర్టికల్ 370 రద్దుతో ఆ ప్రాంత ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతుందని, తీవ్రవాదాన్ని అరికట్టే అవకాశం ఉంటుందని గతంలో మోదీ చెప్పారు.
ప్రస్తుతం జమ్ములో ఉగ్రదాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 2019 నుంచి ఇప్పటి వరకు 683 ఉగ్రదాడులు జరిగాయి. 258 మంది జవాన్లు, 170 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జమ్ములో 25 ఉగ్రదాడులు జరిగాయి. 15 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, 27 మంది గాయపడ్డారు’ అని ఖర్గే తెలిపారు.



