భారత్ ను కలవరపెడుతున్న “మధుమేహం”

పల్లవి, వెబ్ డెస్క్ : ఇండియాలో రోజురోజుకి మధుమేహం శరవేగంగా విస్తరిస్తోంది. సరిగ్గా ఐదేండ్ల కిందట నిర్వహించిన ఓ అధ్యయనంలో నలబై ఐదేండ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు మధుమేహంతో బాధపడుతూ జీవిస్తున్నట్లు ఆ సర్వేలో గుర్తించారు.
అయితే తమకు మధుమేహం ఉందని కూడా ప్రతి ఐదుగురిలో ఇద్దరికి తెలియకపోవడం మరో విశేషం అని ఈ సర్వేలో తేలింది. 2017-2019 మధ్యకాలంలో నలబై ఐదేండ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న దాదాపు అరవై వేల మందిపై లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఇన్ ఇండియా అనే ఓ సంస్థ ఈ సర్వే నిర్వహించింది.
ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే రెండు రెట్లు ఎక్కువగా డయాబెటిస్ (మధుమేహం) భారిన పడుతున్నట్లు ఆ సంస్థ ఆ సర్వేలో గుర్తించింది. లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. భారత్‌లో మధ్య వయస్కులు, వృద్ధుల్లో మధుమేహం కేసులు పెరుగుతున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది.