పాక్ పై యుద్ధానికి సీపీఐ వ్యతిరేకం : నారాయణ
పల్లవి, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ ఆర్మీ చేసిన ప్రతీకార దాడిని యావత్ ప్రపంచమంతా కీర్తిస్తుంటే సీపీఐ పార్టీ నేత నారాయణ మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
ఆపరేషన్ సింధూర్ పై స్పందిస్తూ సీపీఐ నేత నారాయణ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ” ఉగ్రవాదులను హతమార్చడం, యుద్ధం చేయడం వేర్వేరని” వ్యాఖ్యానించారు.
‘ ఉగ్రవాదులను హతమార్చడానికే ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంది. పాక్ పై యుద్ధం చేయడానికి కాదు. ఉగ్రవాదుల నిర్మూలనలో పాకిస్థాన్ కూడా భారత్ కు సహకరించాలి. పాక్ పై యుద్ధానికి సీపీఐ వ్యతిరేకం. పోరు ఉగ్రవాదంపై ఉండాలి. పాక్ పౌరులు, ప్రభుత్వంపై కాదు. అలా చేస్తే ఉగ్రవాదం బలోపేతమవుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.



