బెంగళూరు విషాదం : వెలుగులోకి సంచలన విషయాలు.!

పల్లవి, వెబ్ డెస్క్: ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ సందర్భంగా నిన్న మంగళవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట జరిగి పదకొండు మంది మృతి చెందిన సంగతి తెల్సిందే. ఈ ఘటనలో చాలా మంది గాయాలు పాలయ్యారు. ఈ విషాదం లో సంచలనాత్మకమైన విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా ఐపీఎల్ -2025 ఫైనల్ మ్యాచ్ జరిగిన జూన్ మూడో తారీఖునే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ హోం శాఖకు లేఖ రాసిందని జాతీయ మీడియా ఎన్డీటీవీ కథనాలను ప్రసారం చేసింది. ఆర్సీబీ గెలిస్తే బెంగళూరు విధాన సౌధ దగ్గర వేడుకలకు అనుమతివ్వాలని కోరింది.
అయితే , దానికి పోలీసులు అంగీకరించలేదు అని తేలిపింది. అయినా, సీఎం సిద్ధ రామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ సమక్షంలో విధాన సౌధ వద్ద ఆర్సీబీ ఆటగాళ్లకు ఘనంగా సన్మానం చేశారు. దీంతో రాజకీయ ఒత్తిళ్ళతో పోలీసులు ఆఘమేఘాల మీద అనుమతి ఇచ్చారా అని పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.