ఢిల్లీ సీఎం పై దాడి..!

పల్లవి, వెబ్ డెస్క్ : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా పై ఈరోజు మంగళవారం దాడి జరిగింది. ముఖ్యమంత్రి అధికారక నివాసంలో జన్ సున్వాయి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అర్జీదారుడిగా హజరైన ఓ వ్యక్తి తన బాధలను, సమస్యలను చెప్పుకొచ్చారు. ఉన్నఫలంగా ఒక్కసారిగా సీఎం కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దాడికి దిగారు.
దాడికి దిగిన వ్యక్తికి ముప్పై ఏళ్లు ఉంటాయని పోలీలుసు భావిస్తున్నారు. సీఎంపై దాడి చేసిన వ్యక్తిని.. అక్కడ ఉన్న సీఎం సిబ్బంది తక్షణమే అదుపులోకి తీసుకున్నారు.
పబ్లిక్ మీటింగ్‌లో సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వ్యక్తి ఎందుకు దాడికి పాల్పడ్డారన్న కోణంలో విచారణ నిర్వహిస్తున్నారు. గట్టిగా రెండు సార్లు ఆమె చెంపపై కొట్టినట్లు తెలుస్తోంది. జుట్టు పట్టుకుని మరీ బాదినట్లు చెబుతున్నారు. జుట్టు పట్టి పీకడంతో.. తలకు గాయాలైనట్లు తెలుస్తోంది.