కూలిన విమానం
Air Inida Plane Crashes

పల్లవి , వెబ్ డెస్క్ : గుజరాత్ లోని అహ్మదాబాద్ విమానశ్రయానికి అతి చేరువలో ఓ విమానం కూలిపోయింది. అందులో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
క్షత్రగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. బంధువుల రోదనలతో అ ప్రాంతం అంతటా భయానకంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరలవుతున్నాయి.
అయితే, భారీ సంఖ్యలో మరణాలు సంభవించి ఉండోచ్చని వార్తలు జాతీయ మీడియాలో వస్తోన్నాయి. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఈ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే నియంత్రణ కోల్పోయి మేఘానినగర్ ఏరియాలో సివిల్ ఆస్పత్రి సమీపంలో కూలిపోయింది.