ఆ నీళ్లు తాగితే కవల పిల్లలు పుడతారు
కవల పిల్లలు పుట్టడమనేది సర్వ సాధారణం. వంశపారంపర్యంగా ఇది ఎక్కువగా జరుగుతుంటుంది. కొంతమందిలో ఎలాంటి జన్యుపరమైన కారణాలు లేకపోయినా చాలా అరుదుగా కవలలకు జన్మనిస్తుంటారు.
కవల పిల్లలు పుట్టడమనేది సర్వ సాధారణం. వంశపారంపర్యంగా ఇది ఎక్కువగా జరుగుతుంటుంది. కొంతమందిలో ఎలాంటి జన్యుపరమైన కారణాలు లేకపోయినా చాలా అరుదుగా కవలలకు జన్మనిస్తుంటారు. కొన్ని సందర్భల్లో వైద్య పరిజ్ఞానంతో కూడా కొందరు మహిళలకు కవలలు పుడుతుంటారు. అయితే జన్యుపరమైన సమస్య కానీ, ఎలాంటి వైద్య పరిజ్ఞానం లేకుండానే దాదాపు ఊర్లోని ప్రతి ఇంట్లో కవలలు పుట్టడం అనేది అసాధారణం.
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరానికి దగ్గర్లో రంగంపేట మండలంలో ఉన్న దొడ్డిగుంట అనే గ్రామంలొ 4 వేలకు పైనే జనాభా ఉంటారు. ఈ గ్రామంలో 70కి పైనే కవల జంటలు ఉన్నాయి. ఇప్పటికీ కవల పిల్లల జననం కొనసాగుతూనే ఉంది. ఒకే మొహాన్ని పోలిన అన్నా చెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లు ఈ ఊర్లో ఎక్కువగా కనబడతారు. తరతరాల నుంచి నేటివరకు ఈ గ్రామంలోని తల్లులు.. కవల పిల్లలకు జన్మనిస్తూనే ఉన్నారు. ఆ ఊరి అమ్మాయిని వేరే ప్రాంతానికి చెందిన అబ్బాయి పెళ్లి చేసుకున్నా… వారికి కవల పిల్లలు పుడుతున్నారు. అయితే గత 30 ఏళ్లుగా ఈ ఊరికి దూరంగా పొలాల మధ్య ఉన్న పూర్వకాలం నాటి బావి కవలల జన్మించడానికి కారణంగా మారిపోయింది. ఈ నీటిని తాగడం వల్ల తమకు ట్విన్స్ పుట్టారని ఆ ఊరి ప్రజలతో పాటు అక్కడ ఉద్యోగం కోసం వచ్చిన వారు సైతం చెబుతున్నారు.లాంటి వాటిపై నమ్మకం లేనివారు కూడా ప్రయత్నిస్తే పోయేది ఏముంది అక్కడికి వచ్చి వాటర్ తాగుతున్నారు. ఈ బావి నీటిలో ఉన్న విశిష్టత ఏమిటన్న విషయం ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. అనేక ల్యాబ్స్‌లో ఇక్కడి నీటిని టెస్ట్ చేయించారు. కానీ ప్రత్యేకత ఏం కనిపించలేదు.నిపుణులు ఏం చెబుతున్నప్పటికీ సాధారణ జనం మాత్రం ప్రచారమాయలో పెద్ద సంఖ్యలో తరలివస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది.
రాష్ట్రం నుంచే కాకుండా అనేక ప్రాంతాల నుంచి దొడ్డిగుంట బావి నీటి కోసం జనం వస్తున్నారు. అమెరికాకు సైతం ఈ జలాలు పంపించామని స్థానికులు చెప్పారు. దొడ్డిగుంట బావి నీరుకు విశేష ఆదరణ లభిస్తున్నందున వీటిని రక్షించేందుకు స్థానికులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ బావిని అందరూ గుర్తించేలా ”కవల పిల్లల నుయ్యి” అనే పేరుతో బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ బావి నీళ్లు తాగిన రోగాలు కూడా నయమవుతాయని గ్రామస్తుల నమ్మకం. అందుకే ఊర్లో కుళాయిలు ఉన్నా.. చాలామంది బావి నీళ్లే తాగుతున్నారు.
Related News
-
నాదర్‌గుల్ DPSలో SLC కార్యక్రమం
-
భారత్ – బంగ్లా మధ్య ప్రపంచ భవిష్యత్ ప్రణాళిక సమావేశం
-
పల్లవి స్కూల్లో పోటీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ సెషన్
-
బోయిన్ పల్లి పల్లవి స్కూల్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం
-
ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ టోర్నమెంట్‌లో పల్లవి స్కూల్ హవా
-
అల్వాల్ పల్లవి మోడల్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు



