Diwali Laxmi Puja : లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి.. దీపాలు ఎక్కడ పెడితే మంచిది?
Diwali Laxmi Puja : దీపావళి సందర్భంగా ఇళ్లలో, షాపుల్లో లక్ష్మీ పూజలు చేస్తుంటారు. అయితే, పూజ చేసేందుకు సరైన సమయాన్ని పురోహితులు సూచించారు.
Diwali Laxmi Puja : దీపావళి సందర్భంగా ఇళ్లలో, షాపుల్లో లక్ష్మీ పూజలు చేస్తుంటారు. అయితే, పూజ చేసేందుకు సరైన సమయాన్ని పురోహితులు సూచించారు. వేద పంచాంగం ప్రకారం ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం 5:36 నుంచి 8:11 వరకు, శుభ ముహూర్తం సాయంత్రం 5:31 నుంచి 9:55 గంటల వరకు ఉందన్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5:31-9:55 గంటల మధ్య లక్ష్మీపూజ చేయడం శుభప్రదమని వెల్లడించారు.
దీపావళి పర్వదినాన ఇంట్లోని కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో దీపాలు వెలిగించాలని వేద పండితులు చెబుతున్నారు. ఇంటి గడపకు ఇరువైపులా, వంట గది, ధాన్యాగారం, తులసికోట, రావిచెట్టు కింద దీపం పెట్టాలని సూచిస్తున్నారు. దీంతో పాటు ఆలయాలు, మఠాలు, గోశాలలు, వృక్షాలు, ఇంట్లోని ప్రతి మూలలోనూ దీపాలు వెలిగిస్తే మంచిదని చెబుతున్నారు. నాలుగు వీధుల కూడలిలో దీపం వెలిగించాలంటున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
* లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే క్రాకర్స్ కొనండి.
* వాహనాల దగ్గర, కరెంట్ వైర్ల కింద, డ్రైనేజీ సమీపంలో బాణసంచా కాల్చడం ప్రమాదకరం.
* గాలి వీచే సమయంలో రాకెట్ల వంటి పైకి ఎగిరే టపాసులు కాల్చకండి.
* కాల్చిన బాణసంచాను నీరు నింపిన బకెట్లో వేయండి.
* ఆస్తమా శ్వాస సంబంధిత సమస్యలున్న వారు టపాసులకు దూరంగా ఉండండి. నాణ్యమైన మాస్క్‌లు ధరించండి.
Related News
-
DK Shivakumar : ఫ్రీ బస్సు స్కీమ్‌ను ఎత్తేసే ఆలోచనలో కర్ణాటక ప్రభుత్వం!
-
pawan kalyan : అక్కడి హిందువులకు పవన్ కల్యాణ్ దీపావళి విషెస్!
-
సరూర్ నగర్ పల్లవి స్కూల్లో దీపావళి కాంపిటీషన్స్
-
Gold Rates : అమ్మ బాబోయ్.. దీపావళికి ముందు భారీగా పెరిగిన బంగారం ధరలు
-
దీపావళి క్రాకర్స్ కాల్చేవారికి పోలీసులు షాక్
-
JioBharat 4G Diwali Offer : రిలయన్స్ జియో బంపరాఫర్.. రూ. 699కే 4జీ ఫోన్లు



