కేసీఆర్తో సబితా ఇంద్రారెడ్డి భేటీ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆ పార్టీ చీఫ్ కేసీఆర్తో సమావేశమయ్యారు. ఆదివారం కొడుకు కార్తిక్ రెడ్డితో కలిసి ఆమె కేసీఆర్తో భేటీ అయ్యారు. ఇటీవల అసెంబ్లీలో సబితపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన విమర్శల నేపథ్యంలో ఆమె కేసీఆర్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళ ఎమ్మెల్యేపై సీఎం వ్యాఖ్యలను ఖండించిన కేసీఆర్.. భవిష్యత్ కార్యాచరణపై వారితో చర్చించినట్లు సమాచారం.