స్మితా సబర్వాల్‌పై చర్యలేవీ?.. ప్రభుత్వాన్ని ప్రశినించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
దివ్యాంగుల రిజర్వేషన్ కోటాపై సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. శాసనమండలిలో ఆయన మాట్లాడారు. స్మితా సబర్వాల్ దివ్యాంగులను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. స్మితా రిజర్వేషన్ సిస్టమ్‌నే అవమానించారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల విధానాన్ని ఆమె ప్రశ్నించారన్నారు. దివ్యాంగులను కించపరిచేలా మాట్లాడితే చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైన ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు.



