పాక్ కు ఐరాస షాక్..!

పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఐరాస భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. ఉగ్రదాడి గురించి పాకిస్థాన్ చెప్పిన పలు అంశాలను ఈ సందర్భంగా ఐరాస భద్రతామండలి సభ్య దేశాలు తిరస్కరించాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న తాజా సమస్యను భారత్‌తో ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకోవాలని పాక్ కు సూచించింది.
ఈ క్రమంలో పాక్‌కు కీలక ప్రశ్నలను భద్రతామండలి సభ్యదేశాలు సంధించారు. ఒక్కసారిగా మూకుమ్మడి దాడితో అవాక్కయ్యారు పాక్ ప్రతినిధులు.. లష్కరే తోయిబా ప్రమేయంపై పాక్‌ను ఐరాస ఆరా తీయడమే కాకుండా ఉగ్రదాడికి పాల్పడి ,ప్రత్యేకంగా ఒక మతం పర్యాటకులనే కాల్చి చంపడంపై తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేసింది. తీరు మార్చుకోకపోతే ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడటం ఖాయం అని హెచ్చరించింది.