భారత్ కు ట్రంప్ మరో షాక్..!

పల్లవి, వెబ్ డెస్క్ : భారత్ కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో బిగ్ షాకిచ్చారు. ఇండియాపై ఉన్న అక్కసుతో ట్రంప్ అదనపు టారిఫ్ వేసి మరోసారి తన ఉక్రోషాన్ని ఆయన వెళ్లగక్కారు. దాదాపు ఇరవై ఐదు శాతం అదనపు టారిఫ్ లు విధిస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే, ఇప్పటికే ఇండియాపై ట్రంప్ ఇరవై ఐదు శాతం సుంకాల భారం మోపారు.
తాజాగా దీనికి అదనంగా సుంకాలు ఉంటాయని ఇటీవల ప్రకటించిన ఆయన తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఇండియాపై ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకం చేశారు. మరోవైపు ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన యాబై శాతం సుంకాల గురించి భారత్ తీవ్రంగా స్పందించింది. ఇండియా పట్ల అమెరికా వ్యవహరించిన తీరు అత్యంత దురదృష్టకరం అని అభివర్ణించింది. ఇది ఎంతో అన్యాయం, అకారణమని , ఇది అసలు అసమంజసమని భారత్ స్పష్టం చేసింది. భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని రకాల చర్యలను తీసుకుంటదని పునరుద్ఘాటించింది.