పాక్ కీలక ప్రకటన..!

పల్లవి, వెబ్ డెస్క్ : బుధవారం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఈ దాడిలో తొంబై మంది ఉగ్రవాదులతో పాటు కీలకమైన ఉగ్రనేతలు హతమైనట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న తరుణంలో పాకిస్థాన్ కీలక ప్రకటన చేసింది. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ ” భారత్ ప్రస్తుత ఆపరేషన్లను ఆపితే తామూ ఆపుతామని” అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో వ్యాఖ్యానించారు. సంయమనం పాటించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, పాకిస్థాన్ యుద్ధం కోరుకోవడం లేదని వెల్లడించారు.