ట్రంప్ కు షాకిచ్చిన మస్క్

పల్లవి, వెబ్ డెస్క్ : ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రధాన కారణమైన అందరికీ తెల్సిందే.
ఇందుకుగానూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మస్క్ ను అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు అప్పజెప్పారు. తాజాగా మస్క్ అడ్మినిస్ట్రేషన్ నుంచి తప్పుకుంటున్నట్లు ఎక్స్ లో పోస్టు చేశారు.
ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేస్తూ ” ప్రభుత్వ ప్రత్యేక ఉద్యోగిగా నా షెడ్యూల్డ్ టైమ్ ముగిసింది. వృథా ఖర్చులను తగ్గించేందుకు నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్ కు థాంక్స్. భవిష్యత్ లో డీఓజీఈ మిషన్ మరింత బలపడుతుంది” అని పేర్కొన్నారు. కాగా ఇటీవల ట్రంప్ నిర్ణయాలను మస్క్ పబ్లిక్ గా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.