పాకిస్థాన్ లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు

పల్లవి, వెబ్ డెస్క్ : ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉగ్రదాడులకు పాల్పడి వేలాది మందిని బలితీసుకున్న ఏడుగురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు దాయాది దేశమైన పాకిస్థాన్ రక్షణ కల్పిస్తోంది.
వీరిలో లష్కర్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ , జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ , ఇస్లాం మతబోధకుడు జకీఉర్ రెహ్మాన్, హుజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ సయ్యద్ సలా ఉద్దీన్ , మాఫీయా డాన్ దావూద్ ఇబ్రహీం, ఇండియన్ ముజాహిదీన్ ఫౌండర్ ఇక్బాల్, రియాజ్ భక్తల్ సోదరులు పాకిస్థాన్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ , జైషే మహమ్ద్ చీఫ్ మసూద్ అజర్ పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోనే ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయని ఇప్పటికే ఇండియా టుడే తెలిపింది.ఇటీవల ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఇండియన్ ఆర్మీ జరిపిన దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూ అజార్ కుటుంబానికి చెందిన పద్నాలుగు మంది సభ్యులు చనిపోయారు. వీరికి పాకిస్థాన్ పీఎమ్షరీఫ్ రూ. 14కోట్ల పరిహారం ప్రకటించారు.