కేరళ నర్సుకు ఉరిశిక్ష వాయిదా..

పల్లవి, వెబ్ డెస్క్ : యెమెన్ లో జరిగిన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీ హత్య కేసులో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు ఈనెల పదహారో తారీఖున యెమెన్ ప్రభుత్వం మరణ శిక్ష అమలు చేయనున్న సంగతి తెలిసిందే.2016లో నిమిషను తన భార్యగా పేర్కొంటూ మెహదీ ఆమె పాస్ పోర్టును లాక్కున్నాడు.
ఆమె పోలీసులకు పిర్యాదు చేసిన ఫలితం లేకపోయింది. దీంతో ఎలాగైనా పాస్ పోర్టును తీసుకోవాలని నిమిష 2017లో అతడికి మత్తుమందు మోతాదుని మించి ఇవ్వగా ఎక్కువై మెహదీ చనిపోయాడు.
ఈ కేసులో ఆమెకు అక్కడి ప్రభుత్వం మరణశిక్షను విధించింది. తాజాగా ఆమె ఉరిశిక్షను వాయిదా వేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి. మరోవైపు ఈ శిక్ష నుంచి నిమిషను తప్పించాలని అక్కడి ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు భారతవిదేశాంగ శాఖ సంప్రదింపులు జరుపుతోంది.