ఎలాన్ మస్క్ పార్టీ అమెరికా రాజకీయాలను ప్రభావితం చేయగలదా..?

పల్లవి, వెబ్ డెస్క్ : ప్రముఖ ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టమైతే కొత్త పార్టీ పెడతానని గతంలో ప్రకటించిన సంగతి తెల్సిందే. ఎలాన్ మస్క్ అన్నట్లు గానే ‘అమెరికా పార్టీ’ పేరుతో సరికొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు ఎక్స్ వేదికగా మస్క్ వెల్లడించాడు. ప్రస్తుతం అమెరికా దేశంలో ప్రజాస్వామ్యం లేదు, ఏ వర్గానికి స్వేచ్ఛ లేదు, ఆ స్వేచ్ఛ ఇచ్చేందుకే అమెరికా పార్టీని స్థాపిస్తున్నట్లు తెలిపారు.
అయితే తాను స్థాపించిన ఈ సరికొత్త పార్టీ ద్వారా దేశంలోని ద్విపార్టీ వ్యవస్థను సవాల్ చేయనున్నట్లు వివరించారు. అయితే మస్క్ స్థాపించిన ఈ సరికొత్త పార్టీతో అమెరికా రాజకీయాలను ప్రభావితం చేయగలిగే అవకాశాలు చాలా తక్కువ. ఆయనకు అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం లేదు.
విదేశాల్లో జన్మించిన కారణంగా ఆయనకు ఆ అర్హత లేదు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికాలో జన్మించిన పౌరులకే అధ్యక్షుడయ్యే అవకాశం ఉంటుంది. కానీ మహా అయితే గవర్నర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అంతగా ప్రభావితం చేయలేరని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే గతంలో విదేశాల్లో జన్మించిన హాలీవుడ్ స్టార్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జ్ నెగ్గర్ కాలిఫోర్నియా గవర్నర్ అయ్యారు అని ఊదాహరణలను సూచిస్తున్నారు.