హైడ్రా భయంతో మహిళ అత్మహత్య..రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
హైడ్రాపై భయాందోళనలు సృష్టించేలా సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని మానుకోవాలని కోరారు.
హైడ్రా కూల్చివేతల భయంతో హైదరాబాద్‌లోని కూకట్పల్లి ప్రాంతానికి చెందిన గుర్రంపల్లి బుచ్చమ్మ(56) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. నల్ల చెరువులోని ఆక్రమణలకు హైడ్రా అధికారులు ఇటీవల తొలగించారు. చెరువు పరిసరాల్లోని ఇతర నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చేస్తుందని స్థానికంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో తమ ఇళ్లు ఎక్కడ కోల్పోతామోనని తీవ్ర మనోవేదనకు గురైన బుచ్చమ్మ..శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది.
కూకట్‌పల్లిలోని యాదవబస్తీలో నివాసముండే శివయ్య, బుచ్చమ్మ దంపతులకి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. పాలవ్యాపపారం చేసి సంపాదించిన డబ్బంతా పోగేసి ఆ ప్రాంతంలోనే శివయ్య–బుచ్చమ్మ దంపతులు మూడు ఫ్లాట్ లను కొనుగోలు చేసి ఇళ్లు కట్టారు. ఆడపిల్లలకు పెళ్లి చేసిన తర్వాత ఒక్కోక్కరికి ఒక్కోఇళ్లు కట్నంగా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ మూడు ఇళ్లను హైడ్రా బుల్డోజర్లు ఎప్పుడు కూల్చేస్తాయో అని భయంతో బుచ్చమ్మ తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఘటనపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. ఈ ఘటనతో హైడ్రాకు సంబంధం లేదన్నారు. హైడ్రా కూల్చివేతల గురించి ఎలాంటి భయాలు అక్కర్లేదని తెలిపారు.
బాధిత మహిళకు చెందిన ఇళ్లు కూకట్ పల్లి చెరువుకు సమీపంలోనే ఉన్నప్పటికీ ఎఫ్టీఎల్ పరిధిలో లేవని,ఆమె ఇళ్లు సేఫ్ గా ఉంటాయన్నారు. అయితే ఇళ్లు కూల్చివేస్తారన్న భయంతో కుమార్తెలు తల్లిని ప్రశ్నించినట్టు తెలిసిందన్నారు. ఈ క్రమంలోనే సదరు మహిళ ఆత్మహత్య చేసుకొని ఉంటుందన్నారు. కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు హైడ్రాపై అవాస్తవ వార్తలను ప్రచారం చేస్తున్నాయని..హైడ్రాపై భయాందోళనలు సృష్టించేలా సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని మానుకోవాలని కోరారు. పేద,మధ్య తరగతి ప్రజలు హైడ్రా కూల్చివేతల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడరని,ప్రభుత్వం దీనికి సంబంధించిన ఖచ్చితమైన సూచనలు జారీ చేసినట్లు రంగనాథ్ తెలిపారు.
బుచ్చమ్మ మరణం తీవ్రంగా బాధిస్తోందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు.ఇది హైడ్రా చేసిన హత్యేనన్నారు. నల్లచెరువు హైడ్రా బాధితురాలు బుచ్చమ్మది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికి సర్కారు హత్యనేనని.. దీనికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి వహించాలని ఈటెల శనివారం ఎక్స్ లో ఓ పోస్ట్ లో తెలిపారు. నల్లచెరువు దగ్గరికి తాను ఇంతకముందు వెళ్ళినప్పుడు బుచ్చమ్మ ఆమె కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ వచ్చి బోరున ఏడ్చారని.. కూతుళ్లకు ఏం సమాధానం చెప్పుకోవాలని గుండెలు బాదుకుందని.. బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని ఈటెల అన్నారు.
Related News
-
దారిదోపిడి పాల్పడుతున్న నలుగురు దోపిడి దొంగలు అరెస్ట్
-
డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో భారీ మోసం… నకిలీ తాళాలకు రూ.2లక్షలు
-
హైడ్రాపై హైకోర్టు సీరియస్..ఏంటయ్యా రంగనాథ్ ఇది!
-
హైదరాబాద్ లోని ఆ రెండు మాల్స్ కి ఎగబడుతున్న జనం..దేశంలోనే టాప్!
-
హైడ్రా దూకుడు..ఆరుగురు ఆఫీసర్ల అరెస్ట్‌కు రంగం సిద్ధం!
-
హైడ్రాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్



