హైడ్రాపై హైకోర్టు సీరియస్..ఏంటయ్యా రంగనాథ్ ఇది!
హైడ్రా కూల్చివేతల విషయంలో పెద్దొళ్లు, పేదోళ్లు అనే వ్యత్యాసం చూపిస్తున్నారా అని ప్రశ్నించింది.
హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణ కోసం రేవంత్ సర్కార్ హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో నిర్మించిన పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే హైడ్రా ప్రధాన ఎజెండా. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా అక్రమ నిర్మాణాలను హైడ్రా బుల్డోజర్లు కూల్చివేస్తున్నాయి. అయితే హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇందులో భాగంగానే కొందరు హైడ్రా కూల్చివేతలను తప్పుపడుతూ వాటిని ఆపాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సోమవారం విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ కు చివాట్లు పెట్టింది. ఈ విచారణకు వర్చువల్ గా హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాల్ని కూడా ఎలా కూల్చుతారంటూ హైడ్రాపై మండిపడింది.
హైడ్రా కూల్చివేతల విషయంలో పెద్దొళ్లు, పేదోళ్లు అనే వ్యత్యాసం చూపిస్తున్నారా అని ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చిన టైం గడవక ముందే ఇళ్లను కూల్చివేయడం హైడ్రా అత్యుత్సాహం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టడం వెనుక హైడ్రా ఉద్దేశం ఏమిటో చెప్పాలని నిలదీసింది. వీకెండ్‌లోనే కూల్చివేతలు ఎందుకని హైకోర్టు ప్రశ్నించగా.. అమీన్‌పూర్‌లో కేవలం పరికరాలు మాత్రమే సమకూర్చామని హైడ్రా కమిషనర్ హైకోర్టుకు తెలిపారు. ఆదివారం ఎలా పరికరాలు సమకూరుస్తారు.. ఆదివారం కూల్చడంలో మీ ఉద్దేశం ఏమిటంటూ ధర్మాసనం ప్రశ్నించింది. రేపు చార్మినార్ తహశీల్దార్ వచ్చి.. చార్మినార్, హైకోర్టును కూల్చడానికి పరికరాలు అడుగుతారు కూల్చేస్తారా? అంటూ రంగనాథ్‌ను ప్రశ్నించింది.
ప్రజల నమ్మకాన్ని కోల్పోవద్దన్న హైకోర్టు సూచించింది. రాజకీయ నేతల కోసం పనిచేస్తే ఇబ్బందుల్లో పడతారని.. చంచల్ గూడ, చర్లపల్లికు పంపిస్తే తెలుస్తుందంటూ హైకోర్టు తెలిసింది. ఇష్టానుసారంగా భవనాలను కూల్చేస్తే జీవో99పై స్టే ఇస్తామంటూ న్యాయస్థానం తెలిపింది. మరోవైపు మూసినదిపై ప్రభుత్వం దగ్గరున్న యాక్షన్ ప్లాన్ ఏంటో చెప్పాలని కోరింది. విచారణ అనంతరం హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది
Related News
-
స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్ డేట్
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి షాకిచ్చిన హైకోర్టు.!
-
హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
-
మూసీ వద్ద ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని పెడతా : సీఎం రేవంత్ రెడ్డి
-
సీఎం కన్ను పడొద్దమ్మా..ఇళ్లకు దిష్టి తీస్తున్న మహిళలు!
-
హైడ్రా భయంతో మహిళ అత్మహత్య..రంగనాథ్ కీలక వ్యాఖ్యలు



